ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తా: షర్మిల - Sharmila on cm kcr

Sharmila tour in khammam: ఖమ్మం జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో... తల్లి విజయమ్మతో కలిసి పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లండించారు.

ysrcp
ysrcp
author img

By

Published : Dec 16, 2022, 7:58 PM IST

Sharmila tour in khammam: ఖమ్మం జిల్లా పాలేరు నుంచే ప్రతి గడపకూ నాటి వైఎస్‌ పాలనను గుర్తుచేసేలా ప్రభుత్వాన్ని అందిస్తామని వైతెపా అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైఎస్‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించామని తెలిపారు. ఖమ్మం గ్రామీణ మండలం పోలెపల్లి రెవెన్యూ పరిధిలోని కరుణగిరి సమీపంలో పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి తల్లి విజయమ్మతో కలిసి షర్మిల భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలో నిలుస్తానని పునరుద్ఘాటించారు. పాలేరు ప్రజల హక్కుల కోసం పోరాడుతానని, హక్కులు సాధించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనకు పోరాడే శక్తి ఉందని, మాట కోసం నిలబడే నిజాయితీ, సేవ చేయాలన్న తపన ఉందన్నారు. ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినా.. ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం నిలబడతామని వెల్లడించారు.

ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా అభివృద్ధి చేసిన వైఎస్‌ఆర్‌ పాలనను ఆదర్శంగా తీసుకొని కొనసాగుతామన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, మహిళలు ఆర్థికంగా స్వశక్తితో ఎదిగేలా, వ్యవసాయం పండగ చేసేలా పాలన సాగిస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ముఖ ద్వారం ఖమ్మం జిల్లా అయితే వైఎస్‌ఆర్‌ పాలనకు పాలేరు నుంచే నాంది పలకాలని ఆకాంక్షించారు. పాలేరు ప్రజలు అండగా నిలిచి వైఎస్‌ఆర్‌ బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా సవాళ్లను స్వీకరించి షర్మిల ముందుకెళ్తుందన్నారు. షర్మిలను ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. షర్మిల ప్రజాప్రస్థానంలో శుక్రవారం సుదినమని విజయమ్మ తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.