ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనా బారిన పడి మరణించారు. కూసుమంచికి చెందిన శైలజ, రాము దంపతులు మహమ్మారి పంజాకు ప్రాణాలొదిలారు. రెండు రోజుల క్రితమే భర్త మృతి చెందగా.. ఈరోజు భార్య శైలజ మృత్యువాత పడ్డారు.
తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లి..
కూసుమంచికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కందుల వెంకటేశ్వర్లు, భార్య డేవిడ్ మణి కొవిడ్ బారిన పడి కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన తల్లిదండ్రులను చూసేందుకు భర్త దామళ్ల రాము(34)తో కలిసి దామళ్ల శైలజ.. ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వైరస్ సోకింది. కరోనా కాటుకు మొన్న భార్య ప్రాణాలు కోల్పొగా.. ఈరోజు ఆమె భర్త రాము ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదిలా ఉండగా రాము హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో భార్య, భర్తలిద్దరూ మరణించడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.