పేదలకు సంక్షేమ ఫలాలు అందించడం, ఆదరణ లేని కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం కేవలం కేసీఆర్ సర్కార్కే సాధ్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.
పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రత్యేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ సూతకాని జైపాల్, వైస్ ఛైర్మన్ ముళ్లపాటి సీతారాములు పాల్గొన్నారు.