ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో మహిళా ఉద్యోగులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన క్రీడాపోటీల్లో పాల్గొని సందడి చేశారు. కబడ్డీ, పరుగు పందెంతో పాటు పలు ఆటల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు.
అతివలంతా కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ... ఉత్సాహంగా గడిపారు. పాఠశాలల విద్యార్థినిలకు కూడా పోటీలు నిర్వహించారు. నాచారం గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఏర్పాటు చేశారు.