ఖమ్మం జిల్లా ఏన్కూరు పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న కేజీబీవీ సిబ్బందికి సమాన వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగభద్రత కల్పించాలని, మహిళా ఉద్యోగులకు రాత్రి వేళలో విధులు లేకుండా... వార్డెన్లను నియమించాలన్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు.