స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) అభివృద్ధికి కృషి చేస్తామని ఛైర్మన్ విజయ్‌కుమార్ తెలిపారు. ఎన్నెస్టీ రోడ్డులో నూతన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో ఆయన కుర్చీలో కూర్చున్నారు. సుడా పరిధిలోని ఎనిమిది మండలాల్లో అభివృద్ధికి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల సహకారంతో పనిచేస్తామన్నారు.
స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేసేముందు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. మంత్రి అజయ్‌తో కలిసి సుడాను ముందుకు తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీచూడండి: సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ విఠల్ కన్నుమూత