జనతా కర్ఫ్యూ అనంతరం ఖమ్మంలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. రైతు బజార్‌లు తెరవకపోవటం వల్ల బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. ఈరోజు నగర వాసులు ఒక్కసారిగా కూరగాయల మార్కెట్ యార్డుకు తరలిరావటం వల్ల వ్యాపారులు ఇదే అదనుగా భావించి రేట్లు పెంచారు.
రెండు రోజుల క్రితం 10 రూపాయలు ఉన్న కిలో టమాట ఈరోజు 40 రూపాయలకు పెంచి విక్రయిస్తున్నారు. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు పెంచి విక్రయిస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ను అతిక్రమించకండి.. బాధ్యతగా ఉండండి: ప్రధాని