Two Year Old Enters Into India Book Of Record : పిట్ట కొంచం కూత ఘనం అనే నానుడికి సరిగ్గా సరిపోతాడు.. ఆ చిన్నారి. పాల బుగ్గల వయస్సులో దేశ విజ్ఞాన్ని బుర్రలో ఇముడ్చుకొని అబ్బుర పరుస్తున్నాడు. బడిబాట పట్టకుండానే బోలెడు తెలివి తేటలు ప్రదర్శిస్తూ ఏకంగా ఇండియా బుక్‌ఆఫ్ రికార్డ్ 2023 స్థానం దక్కించుకున్నాడు. ఆ చిన్నారి మాటలు చూస్తే అంతా అశ్చర్యంగా చూడాల్సిందే.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం లచ్చగూడెంకి చెందిన నల్లమల అశ్విన్‌కుమార్, అశ్విని దంపతుల కుమారుడు వెంకట్ జయాన్ష్. ప్రస్తుతం 29నెలలు. అక్షరాలు దిద్దకముందే విజ్ఞాన్ని నింపుకొని శభాష్ అనిపిస్తున్నాడు. బుడిబుడి అడుగుల ప్రాయంలో ప్రపంచఖండాలు, దేశంలోని రాష్ట్రాలు.. రాజధానులు, వెయ్యికి పైగా వస్తువులు, రంగుల పేర్లు, వాహనాలు.. కూరగాయాల రకాలు, రోజులు, నెలలు చకచకా చెబుతూ వారెవ్వా అనిపిస్తున్నాడు.
స్కేటింగ్‌లో 'సృష్టి' అదుర్స్.. 11ఏళ్లలో 6 గిన్నిస్ రికార్డులు.. మరో రెండు వెయిటింగ్!
"చిన్నప్పటి నుంచి ఏది చెప్పినా గుర్తు పెట్టుకోవడం మొబైల్ ఏదైనా డైలాగ్స్ వస్తే విని మళ్లీ అదే డైలాగ్ చెప్తాడు. పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ 8సంవత్సరాలు ఉన్నప్పుడే చెప్పాడు. పడుకునేటప్పుడు ఏదైనా చెప్తే మళ్లీ లేవగానే చెప్పేవాడు. పోర్టల్‌లో ఇండియాబుక్ ఆఫ్ రికార్డు అప్లై చేసిన వారం రోజులకు మాకు రిప్లై వచ్చింది. మా అబ్బాయి రెండేళ్ల వయస్సులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది.'' -చిన్నారి, తల్లిదండ్రులు
2years kid bags India Book of Record : అంకెల వరకు తెలుగు, ఆంగ్లం, హిందీలో చెప్పేస్తున్నాడు. అంతే కాకుండా 20కు పైగా ఆంగ్లం, తెలుగు పద్యాలు, శ్లోకాలు, గోవిందనామాలు సాయి కీర్తనలు కంఠస్తం చేశాడు. చిన్నారిలోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తనలోని విజ్ఞానాన్ని ఆగస్టు 29న ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పంపారు. సెప్టెంబర్ 4న అవార్డుతో పాటు బంగారు పతకాన్ని సాధించాడు. ఇటీవలనే ఆసియా బుక్ ఆఫ్ రికార్డుకు పంపించారు.
22లక్షల దీపాల వెలుగులో అయోధ్య- ఉజ్జయిని రికార్డు బ్రేక్, గిన్నిస్‌లో చోటు
నెలల వయస్సు నుంచే టీవీలో వచ్చే తగ్గేదిలే అనే యాక్షన్‌ను అనుకరించేవాడని.. ఆ తర్వాత అదే తరహాలో కొన్ని అనుకరించడంతో బాబులో అందరి కంటే భిన్నంగా జ్ఞాపక శక్తి ఉందని గ్రహించినట్లు తండ్రి అశ్విన్‌కుమార్ తెలిపాడు. కుమారుడిలో ప్రతిభను గ్రహించి తల్లి అశ్విని పలు అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. రెండేళ్ల వయస్సులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలబుగ్గల వయస్సులో తన జ్ఞానపక శక్తితో అబ్బుర పరుస్తున్న చిన్నారిని చూసి పలువురు అభినందిస్తున్నారు.
అతిపొడవైన జడతో స్మిత గిన్నిస్ రికార్డ్- రాలిన జుట్టుతో వారికి సాయం!
'కోటి' శివలింగాలకు ప్రత్యేక పూజలు- ప్రపంచంలోనే తొలిసారి- తెలుగురాష్ట్రాల భక్తులే ఎక్కువ!