ETV Bharat / state

ఓ వ్యక్తి ఖాతాలోకి రూ.2కోట్లు.. అతడేం చేశాడంటే..?

wrong transaction in Khammam : మనం ఎవరి ఖాతాలోకైనా నగదు జమ చేస్తున్నప్పుడు.. ఖాతా నంబర్ తప్పుగా ఎంటర్ చేయడం వల్లో.. సాంకేతిక సమస్య వల్లనో.. అప్పుడప్పుడు.. పొరపాటుగా అది వేరే వారి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఖాతాలోకి ఏకంగా రూ.2 కోట్లు జమయ్యాయి. మరి అప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా..?

wrong transaction in Khammam
wrong transaction in Khammam
author img

By

Published : Feb 23, 2022, 8:30 AM IST

wrong transaction in Khammam : రూ.లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా ఓ వ్యక్తి ఖాతాలో రూ.2 కోట్లు జమయ్యాయి. తొలుత ఆశ్చర్యానికి గురైన ఆయన తేరుకుని వివరాలు ఆరా తీసి ఆ సొమ్మును బదిలీ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామానికి చెందిన గంధం వెంకటేశ్వర్లు వ్యాపారి. వైరాలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా భవన సముదాయం ఉంది. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన ఓ సంస్థ వారు అందులో బ్రాంచి ఏర్పాటు చేశారు. యజమాని వెంకటేశ్వర్లు ఖాతాలో నెలనెలా అద్దెను జమ చేస్తుంటారు.

wrong transaction in Wyra : ఈ నెల 19న ఆయన ఖాతాలో ఆ సంస్థ నుంచి రూ.2 కోట్ల నగదు జమైందంటూ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. బ్యాంకులో ఆరా తీయగా అధికారులు నిజమేనని ధ్రువీకరించారు. వెంటనే సమాచారం ఇవ్వగా.. క్లర్కు పొరపాటుగా వేరొకరికి పంపాల్సిన మొత్తాన్ని వెంకటేశ్వర్లు ఖాతాకు జమ చేసినట్టు ఆ సంస్థ గుర్తించింది. మంగళవారం ఆయన ఆ మొత్తాన్ని ఆ సంస్థ ఖాతాకు మళ్లించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.