ETV Bharat / state

Tummala on Chandrababu arrest : "రాజకీయ కక్షతో.. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం" - Tummala Nageswara Rao latest news

Tummala on Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజ్యాంగ హక్కులను కాలారాస్తూ రాజకీయ కక్షతో.. చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు దుర్మార్గమని పేర్కొన్నారు.

Tummala Fires on Chandrababu Arrest
Tummala on Chandrababu Arrest
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 10:36 PM IST

Updated : Sep 10, 2023, 6:25 AM IST

Tummala Fires on Chandrababu Arrest : స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో అక్రమాలు జరిగాయంటూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Arrest) అరెస్ట్​పై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలోను పలువురు నేతలు ఈ అరెస్ట్​ను ఖండించారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుపై.. అసత్యాలతో కట్టుకథలతో అరెస్ట్​ చేయడం దారుణమని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్​ని తీవ్రంగా ఖండిస్తున్నానని తుమ్మల స్పష్టం చేశారు.

Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్​.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు

కనీస న్యాయ సూత్రాలు పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆయన ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేశారని.. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజ్యాంగ హక్కులను కాలారాస్తూ రాజకీయ కక్షతో చంద్రబాబు పట్ల వ్యవహారించిన తీరు దుర్మార్గమని పేర్కొన్నారు.

TDP Leaders Protest in Telangana Against Chandrababu Arrest : తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఏపీ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ టీడీపీ నేతలు(Telangana TDP Leaders) పలుచోట్ల ఆందోళనలకు దిగారు.

Siddhartha Luthra will Argue on Chandrababu Arrest చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సిద్దార్థ లూథ్రా

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ వద్ద పార్టీ నాయకుడు బక్క నర్సింహులు ఆధ్వర్యంలో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్‌ చేశారని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని దోమలగూడ టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర ఏపీ సీఎంపై వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కూకట్‌పల్లి జేఎన్​టీయూ కూడలి వద్ద పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Chandrababu Arrest Respond Telangana Leaders : రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ భద్రాచలంలో ఎన్టీఆర్​ విగ్రహం ఎదుట ఆ పార్టీ శ్రేణులు ఆందోళలు చేపట్టారు. బేషరతుగా టీడీపీ అధినేతను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో నిరసన చేపట్టిన కార్యకర్తలు ఓటమి భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల అంబేడ్కర్‌ కూడలిలో కార్యకర్తలు కళ్లకు నల్ల రిబ్బను కట్టుకుని నిరసన తెలిపారు. సీఎం జగన్​ డౌన్​ డౌన్​ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Chandrababu Arrest in Nandyala : తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకుంటున్నట్లు నోటీసులు (CID Notices to Chandrababu Naidu) ఇచ్చారు. కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సమర్పించాలని పోలీసులను చంద్రబాబు కోరారు. అందుకు సంబంధించిన వివరాలు, రిమాండ్‌ రిపోర్టు తర్వాత ఇస్తామని సీఐడీ అధికారులు చెప్పారు. నంద్యాల నుంచి రోడ్డుమార్గంలో చంద్రబాబును తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి తరలించారు.

AP CID Chief Sanjay on Chandrababu Naidu Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అంతిమ లబ్దిదారు చంద్రబాబే: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్

Protests Across State Against Chandrababu Naidu Arrest చంద్రబాబు అరెస్టుతో అట్టుడికిన రాష్ట్రం.. టీడీపీ శ్రేణుల నిరసనతో ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు

Last Updated : Sep 10, 2023, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.