ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద హడావుడి నెలకొంది. రాష్ట్ర రవాణా మంత్రి అజయ్ కుమార్ కలెక్టర్ కార్యాలయంలో ఆకస్మికంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రిని కలిసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు తరలివచ్చారు. పోలీసులు వారిని ఆవరణలో ఒక చోట కూర్చోబెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమీక్షా సమావేశం అనంతరం మంత్రిని కల్పిస్తామని పోలీసులు చెప్పడం వల్ల రెండు గంటలుగా వారు కలెక్టరేట్లోనే కూర్చున్నారు.
ఇవీ చూడండి: హాంగ్‌కాంగ్‌లో ప్రజా విజయం... 'చైనా బిల్లు' ఉపసంహరణ