ETV Bharat / state

ఖమ్మం బల్దియాలో.. ఎన్నికల వేడి రాజేస్తున్న తెరాస!

author img

By

Published : Sep 13, 2020, 2:08 PM IST

బల్దియా ఎన్నికలకు సమర శంఖం పూరించేందుకు అధికార తెరాస ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఖమ్మం నగరంలో గతంలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడమే కాకుండా.. అదనంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నికల నాటికే ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇక డివిజన్లలో పట్టు కోసం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశావహులు, నేతలు ప్రజల దగ్గరికి వెళ్తున్నా.. ఎన్నికల పోరులో ముందుండి నడిపించే నాయకుడు లేక.. ప్రతిపక్ష పార్టీలు చతికిల పడుతున్నాయి.

TRS Getting ready For Khammam Municipal Elections
ఖమ్మం బల్దియాలో.. ఎన్నికల వేడి రాజేస్తున్న తెరాస!

ఖమ్మం నగర పాలక సంస్థకు 2016 మార్చి 6న ఎన్నికలు జరిగాయి. అదే నెల 9న ఫలితాలు రాగా.. మార్చి 15న కొత్త పాలకవర్గం ఏర్పడింది. మొత్తం 50 స్థానాలున్న ఖమ్మం నగరపాలక సంస్థలో తెరాస 34, కాంగ్రెస్ 10, వైసీపీ 2 , సీపీఎం 2 , సీపీఐ 2 స్థానాలను దక్కించుకున్నాయి. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన మరో 9 మంది కార్పొరేటర్లు తెరాసలో చేరగా.. తెరాస బలం 43కు చేరింది. 2018 డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు కార్పొరేటర్లు తెరాసను వీడి వేరే పార్టీలో చేరారు. లోక్​సభ ఎన్నికల సమయంలో ఇద్దరు కార్పొరేటర్లు తిరిగి తెరాస గూటికి చేరడంతో తెరాస బలం 42 ఉంది. మిగతా 8 మంది కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారు.

ఆరునెలల ముందుగానే..

ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా దాదాపు 6 నెలల ముందుగానే తెరాస ఎన్నికల వేడిని రాజేస్తూ... పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకెళ్తోంది. నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ, ధంసలాపురం రైల్వే వంతెన, ఐటీ హబ్, నూతన బస్టాండ్, నగరపాలక సంస్థ కార్యాలయం పనులతో పాటు నగరంలోని పలు డివిజన్లలో సెంట్రల్ లైటింగ్, ఫౌంటైన్​లు, డివైడర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి డివిజన్​లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇతర ప్రతిపాదిత అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసి ప్రజల మన్ననలు పొందాలని తెరాస భావిస్తోంది. వచ్చే బల్దియా ఎన్నికల్లో తెరాసను మరోసారి పాలకపక్షం వైపు కూర్చోబెట్టడమే లక్ష్యంగా మంత్రి పువ్వాడ అజయ్ అన్ని తానై జిల్లాలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. దసరా నాటికి నగరంలో పెండింగ్​లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసి.. ఎన్నికల నాటికి ప్రతిపక్షాలకు విమర్శించేందుకు అవకాశం ఇవ్వకుండా ఉండే లక్ష్యంతో మంత్రి ముందుకెళ్తున్నారు.

త్వరలో కేటీఆర్ సమీక్ష!

హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల ఎన్నికలను తెరాస ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ సైతం ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఎన్నికలు జరిగే 3 నగరాల్లో స్థానిక మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎన్నికల బాధ్యతలు తీసుకుని పార్టీని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇప్పటికే జీహెచ్​ఎంసీ పరిధిలోని నేతలతో సమావేశాలు పూర్తి చేశారు. త్వరలో వరంగల్, ఖమ్మం తెరాస నేతలతోనూ ఎన్నికల సమాయత్తంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. అయితే ఈ భేటీ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం స్పష్టత లేదు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు మంత్రి వచ్చిన సమయంలో సమీక్ష నిర్వహిస్తారా.. లేక ప్రత్యేకంగా ఎన్నికలపై నేతలతో భేటీ అవుతారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

ప్రధాన ప్రతిపక్షాలకు నాయకత్వ లేమి..

ఓ వైపు తెరాస బల్దియా పోరుకు సమాయత్తమవుతున్న వేళ.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశావహులు, గతంలో పోటీ చేసిన అభ్యర్థులు నడిపించే నాయకత్వం లేక దిక్కులు చూస్తున్నారు. అయితే.. కరోనా సమయంలో ఆయా డివిజన్లలో ప్రస్తుత కార్పొరేటర్లతో పాటు వీరు కూడా ప్రజలకు చేయూతనిచ్చారు. కొన్ని డివిజన్లలో ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు, ఇతర నేతలు గళం వినిపిస్తూ ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నగరంలో పర్యటించి గోళ్లపాడు నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానికంగా కాంగ్రెస్ నేతలు సైతం నిర్వాసితుల తరపున గళం వినిపించారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వ లేమి ఇబ్బందికరంగా మారుతోంది. సాధారణంగా ఎన్నికలు వస్తే ఆయా పార్టీలకు నియోజవర్గ ఇంఛార్జి, పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులో.. ఇతర ముఖ్య నాయకులో ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్, తెదేపా, భాజపా పార్టీలకు ఆ స్థాయి నేతలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం పూరిస్తున్నా పార్టీని నడిపించే నాయకుడి లేమి స్పష్టంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడం ఇప్పుడు పార్టీ పరిస్థితిపై తీవ్ర ప్రభావమే చూపేలా కనిపిస్తోంది. నియోజకవర్గ స్థాయి నేత నగరంలో లేకపోవడం అన్ని డివిజన్లలో ఎన్నికల సమయాత్తానికి ఇబ్బందిగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. తెదేపా, భాజపా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరపున బరిలో నిలిచిన నామా నాగేశ్వరరావు ఇప్పుడు తెరాస ఎంపీగా ఉండటం వల్ల ఎన్నికలను ఎదుర్కోవడంలో తెదేపాకు కష్టం తప్పేలా లేదు. భాజపా కూడా సరిగ్గా ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థి నగరంలో ముఖ్య కార్యక్రమాలు ఉన్నప్పుడే కనిపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అప్పుడప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వామపక్షాలు మాత్రం ఉనికి కోసం పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి.

ఇదీ చూడండి: భారీ వర్షం.. నిలిచిపోయిన రాకపోకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.