ఖమ్మం జిల్లా వైరాలో తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వైరా కూడలిలో ఎమ్మెల్యే రాములు నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో తెరాస ఎదురులేని శక్తిగా ఎదిగిందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని తెలిపారు. పలు చోట్ల మార్కెఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, పురపాలిక ఛైర్మన్ సూతకాని జైపాల్లు జెండాలను ఎగురవేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వలసకూలీలు, పేదలకు నిత్యావసరాలను, కూరగాయలను పంపిణీ చేశారు. ఏన్కూరు, కొణిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు జెండా ఆవిష్కరణలు, పేదలకు వితరణలు చేపట్టారు.
ఇవీచూడండి: తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం