ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్లు, రంగం బంజర్ గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడి.. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. తెల్లవారుజామున వీచిన గాలులకు 5 చెట్లు దేవరకొండ, సత్తుపల్లి జాతీయ రహదారిపై పడిపోయాయి.
మూడు గంటల సమయంలో చెట్లు పడిపోగా.. వాటిని తొలగించేందుకు ఉదయం ఎనిమిది గంటల వరకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇరువైపులా పది కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.
ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 8 గంటల సమయంలో చెట్లు తొలగించడం వల్ల ట్రాఫిక్ క్లియర్ అయింది. 5 గంటల పాటు అధికారులు నిర్లక్ష్యం వహించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: భారత్లో కరోనా.. ప్రపంచానికి ప్రమాద ఘంటిక!