ETV Bharat / state

ఆవిష్కరణలు అద్భుతం: పుట్టింది ఏజెన్సీలో.. చదువుతోంది సర్కారుబడిలో..

author img

By

Published : Jul 19, 2021, 5:02 PM IST

సరిగ్గా 20 ఏళ్లు కూడా నిండని వయసు ఆ కుర్రాళ్లది. పుట్టింది ఏజెన్సీలో. విద్యాభ్యాసం మొత్తం సర్కారు బడిలోనే.. వ్యవసాయం భారమవతున్న వేళ.. సాగు కష్టాలను ప్రత్యక్షంగా చూసి ఏదైనా చేయాలనుకున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుంటున్న రైతుల కష్టాన్ని తగ్గించాలనుకున్నారు. తక్కువ ఖర్చుతో దుక్కు, ఎరువుల తరలింపు తదితరవాటికి పరిష్కారం కనుగొన్నారు. ఆ ఆలోచనల్లోంచి రూపం పోసుకున్న మూడు యంత్రాలు ఔరా అనిపిస్తున్నాయి.

Yuvakula Avishkarana
Yuvakula Avishkarana

వ్యవసాయం భారమవుతున్న రోజులివి. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాగుకయ్యే పెట్టుబడులు భరించలేక పెద్ద రైతులు సొంతంగా ట్రాక్టర్లే కొనుగోలు చేస్తున్నారు. దుక్కి దున్నడం, కలుపుతీయడం, ఎరువులు, విత్తనాల రవాణా, కూలీల తరలింపు ఇలాంటి పనులకు వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు లేని రైతులకు సాగులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సాగుకు వాడే ట్రాక్టర్ల ఖర్చు విపరీతంగా పెరిగింది. దుక్కి దున్నేందుకు ట్రాక్టర్లు దొరక్కపోవడం, దొరికినా ఎక్కువ డబ్బులు అడుగుతుండటం, రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలతో అన్నదాత కుదేలవుతున్నాడు. తల్లిదండ్రుల ఇబ్బందులను దగ్గరనుంచి చూసిన... ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు తమ ఆలోచనలతో మినీట్రాక్టర్లకు రూపం ఇచ్చారు.

ఆవిష్కరణలతో యువకులు
ఆవిష్కరణలతో యువకులు

సాగులో కష్టాలను చూసి..

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తిపల్లి, ముచ్చెర్లకి చెందిన గడ్డం రవికాంత్, చంద్రకాని గోపాలకృష్ణ, జాల దినేశ్. ముగ్గురూ 20 ఏళ్ల లోపు వారే. వ్యవసాయదారులైన తల్లితండ్రులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించేలా మినీ ట్రాక్టర్లు రూపొందించి సాగు చేస్తున్నారు. దుక్కిదున్నడం, విత్తనాలు వేయడం, విత్తనాలు, ఎరువుల బస్తాలు తరలించడం, కలుపు తీయడం వంటి పనులు మినీ ట్రాక్టర్లతోనే చేస్తూ అబ్బురపరుస్తున్నారు. గతంలో సాగు చేసిన సమయంలో దుక్కి దున్నేందుకు ఎకరాకు రూ.2 వేలు ఖర్చవగా... ఇప్పుడు కేవలం రూ.400తోనే పూర్తవుతోంది. ఇద్దరు యువకులు కొద్దిపాటి పెట్రోల్ వినియోగంతో మినీ ట్రాక్టర్​ను నడుపుతుండగా.. మరో యువకుడు కేవలం బ్యాటరీలతో మినీ ట్రాక్టర్​ను నడుపుతున్నాడు. ఏజెన్సీ పల్లెలో పుట్టినప్పటికీ.. అద్భుతమైన ఆవిష్కరణలతో అందరి మన్నలు పొందుతున్నారు.

ప్రస్తుతం పెట్రోల్​, డీజిల్​ ధరలు మండిపోతున్నాయి. అందుకే బ్యాటరీతో నడిచే వాహనాన్ని తయారు చేయాలనుకున్నాను. విడిభాగాలను కొనుగోలు చేసి రూ. 50 వేల ఖర్చుతో బ్యాటరీతో నడిచే ట్రాక్టర్​ను తయారుచేశాను. ఇది గంటకు 42 కిమీ వేగంతో వెళ్తుంది. దీనిపై 5క్వింటా వరకు మోస్తుంది. నాలుగు గంటలు ఛార్చింగ్​ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్​ ట్రాక్టర్​ తయారుచేయడమే లక్ష్యం. -గోపాల కృష్ణ, మినీ ట్రాక్టర్ రూపకర్త.

ఊహతెలిసినప్పటి నుంచి వ్యవసాయంలో ఇబ్బందులెరిగిన వారు... ఈ తరహా యంత్రాలతో ఓ పరిష్కారం కనుగొన్నారు. ఇద్దరు యువకులు రూ.25 వేల చొప్పున ఖర్చు చేసి మినీ ట్రాక్టర్​ను రూపొందించగా... మరో యువకుడు రూ.50వేల ఖర్చుతో బ్యాటరీతో నడిచే ట్రాక్టర్​ను రూపొందించాడు. దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు తీయడం వంటి పనులు ట్రాక్టర్ కానీ, కూలీలు కానీ లేకుండానే సాగు చేస్తున్నారు. అన్ని రకాల వ్యవసాయ పనులకు ఈ బ్యాటరీ వాహనాలను ఉపయోగిస్తున్నారు. చుట్టుపక్కల వారు సైతం ఈ వాహనాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

తగ్గేదేలే..
తగ్గేదేలే..

మానాన్న రైతు. వ్యవసాయం చేస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు పడడం నేను చూశాను. అందుకే తక్కువ ఖర్చుతో ట్రాక్టర్​ రూపొందించాలనుకున్నాను. దీనితో దుక్కితో పాటు వ్యవసాయానికి సంబంధించి చిన్నచిన్న పనులు చేసుకోవచ్చు. రూ. 25 ఖర్చుతో దీనిని తయారు చేశాను. గతంలో ఎకరాకు రూ. 2వేల వరకు ఖర్చయ్యేది. దీనితో 2లీటర్ల పెట్రోలు పోస్తే ఎకరం దుక్కి చేసుకోవచ్చు. ప్రభుత్వం సాయమందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తాను. - రవికాంత్, మినీ ట్రాక్టర్ రూపకర్త.

ప్రభుత్వం సాయమందిస్తే..

భవిష్యత్తులో ఎలక్ట్రికల్​ ట్రాక్టర్​ను తయారుచేయడమే తమ లక్ష్యమని ముగ్గురు యువకులు చెబుతున్నారు. వీరు తయారు చేసిన ట్రాక్టర్లను చూసిన కొందరు కొన్నింటిని తయారుచేయించుకుని వెళ్లారు. ఏజెన్సీ పల్లెలో పుట్టి అద్బుతమైన ఆవిష్కరణలతో సత్తా చాటుతున్న ఈ ముగ్గురు.. ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తే మరిన్ని ప్రయోగాలు చేసి రైతులకు అవసరమైన యంత్రాలు రూపొందిస్తామని చెబుతున్నారు.

మినీ ట్రాక్టర్​తో దుక్కిదున్నుతూ..
మినీ ట్రాక్టర్​తో దుక్కిదున్నుతూ..

మాకు పశువులు లేకపోవడం వల్ల వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాము. అందుకే మినీ ట్రాక్టర్​ చేయాలనుకున్నాను. దీనితో దుక్కి దున్నడం, పత్తి గింజలు వేయడం తదితర వ్యవసాయపనులు చేసుకోవచ్చు. దీనితో వ్యవసాయ ఖర్చు తగ్గడమే కాకుండా.. ఆదాయం కూడా వస్తుంది. -దినేశ్, మినీ ట్రాక్టర్ రూపకర్త.

ఇదీ చూడండి: కొత్తదా? పాతదా? ఆ విషయంలో ఏ కారు ఉత్తమం​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.