ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 39వ రోజూ జోరుగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా కార్మికులు పలుచోట్ల వినూత్నంగా ఆందోళనలు చేపట్టారు. ఖమ్మం డిపో నుంచి బస్టాండ్ వరకు గంగిరెద్దులతో ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం డిపో వద్ద వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. సత్తుపల్లి డిపో ఎదుట కార్మికులు మానవహారం చేపట్టారు. ఇల్లందులో జలదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
ఇదీ చూడండి: ముంచుకొస్తున్న వాయుకాలుష్య భూతం..!