ప్రతి ఎన్నికలో ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తుంటారు. అలాగే ఎన్నికైన నేతలు సైతం విలక్షణమైన నిర్ణయాలే తీసుకొంటారు. ఇది ఎక్కడో కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గ పరిస్థితి. 2009 నియోజకవర్గ పునర్విభజనలో బూర్గంపాడు నుంచి పినపాక ఏర్పడింది. ఇప్పటి వరకు మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒక పార్టీ నుంచి గెలిచిన అనంతరం మరో పార్టీలోకి నేతలు వెళ్లడం ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత.
ఇద్దరిది అదే బాట....
2009లో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన పాయం వెంకటేశ్వర్లు అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల వల్ల తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన రేగా కాంతారావు సైతం గులాబీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే గూటికి చేరడం అందర్ని ఆశ్చర్యపరస్తుంది. రాబోయే ఎన్నికల్లో గెలిచే నేతలైన గెలిచిన పార్టీలో కొనసాగుతారా లేదా అనే ప్రశ్న నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది..
ఇవీ చూడండి:తెరాస తరఫునే పోటీ చేస్తాం