Khammam BJP member suicide: ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయిగణేశ్ మృతితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ ఖమ్మం భాజపాలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సాయిగణేశ్ అనే కార్యకర్త.... ఈ నెల 14న పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగులమందు తాగాడు. తొలుత అతణ్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా... మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. రెండ్రోజులపాటు చికిత్స పొందిన సాయిగణేశ్ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. సాయిగణేష్ మృతితో భాజపా శ్రేణులు..... ఖమ్మంలో ఆందోళనకు దిగారు. తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయిగణేశ్ కుటుంబానికి..... న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
సాయిగణేష్‌ను పోలీసులు, అధికార పార్టీ నేతలు తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆరోపించారు. సాయిగణేశ్‌కు..... ఈ నెల 4న వివాహం జరగాల్సి ఉండగా... ఇంతలోనే ఈ ఘోరం జరిపిపోయిందంటూ... కన్నీటి పర్యంతమ్యయారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పాడుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు.
మృతదేహానికి పోస్టుమార్టం చేయడంలో ఆలస్యం చేస్తున్నారని భాజపా శ్రేణులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిపై దాడిచేశారు. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. మార్చురీ నుంచి మృతదేహం తరలించేందుకు యత్నించగా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలమధ్య తోపులాట జరగగా... కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనలో భాగంగా తెరాస ఫ్లెక్సీలు చింపుతున్న భాజపా కార్యకర్తలపై ఒక సమూహం దాడిచేసి పరారైంది. ఆ దాడిలో భాజపా కార్యకర్త తలకు తీవ్రగాయాలయ్యాయి.
పోస్ట్‌మార్టమ్ అనంతరం గణేష్ అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నపోలీసులు నేరుగా ఖమ్మం కాల్వ ఒడ్డు శ్మశానవాటికకు అంతిమయాత్రసాగేలా జాగ్రత్తపడ్డారు. భాజపా శ్రేణుల నిరసనను దృష్టిలో పెట్టుకుని...... మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం, తెరాస జిల్లా కార్యాలయాల వద్ద... బందోబస్తు ఏర్పాటు చేశారు.
'భాజపా కార్యకర్తలపై పోలీసులు ఇష్టారీతిన రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారు. పదులు కొద్దీ కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల భాజపా సంస్థాగత దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకం ఎగురవేయాలనుకోవడమే సాయి గణేష్ చేసిన పాపం. స్థానిక కార్పొరేటర్ భర్త.. మంత్రి అంజయ్ కుమార్‌కు చెప్పి.. పోలీసుల సహాయంతో గద్దెను కూల్చివేయించారు. పోలీసులు, తెరాస నాయకుల వేధింపులతోనే సాయి గణేష్ మృతి చెందారు.' -స్థానిక భాజపా నేతలు
ఇవీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు