రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలో పర్యటించారు. ఖిల్లా బజార్లో కొంత మంది నాయకులు కాంగ్రెస్ నుంచి మంత్రి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని తెరాసలోకి మంత్రి పువ్వాడ ఆహ్వానించారు.
గత ఎన్నికల్లో ఇతర పార్టీల నాయకులు తనపై ఎన్ని పుకార్లు పుట్టించినా.. మైనార్టీ సోదరులు తనకు అండగా ఉన్నారని మంత్రి పువ్వాడ అన్నారు. ఇప్పుడు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో 10 మంది మైనార్టీలకు టికెట్లు ఇస్తామని మాటిచ్చారు.
- ఇదీ చదవండి ఈనెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశాలు