ETV Bharat / state

'మేం నిధులిస్తే మీరు పరిగణనలోకి తీసుకునేదేమిటి?' - mp nama about railway funds for telangana

రైలు మార్గాలపై రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ), రోడ్‌ అండర్‌ బ్రిడ్జిల (ఆర్‌యూబీ) నిర్మాణానికి 50 శాతం నిధులు రాష్ట్రం వెచ్చించాలనడం సరికాదని తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు అన్నారు. వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించాలని కోరారు. రైల్వే పద్దులపై లోక్‌సభలో సోమవారం జరిగిన చర్చలో తెలంగాణ ఎంపీలు మాట్లాడారు.

MP Nama Nageswara Rao in Parliament
పార్లమెంట్​లో ఎంపీ నామ నాగేశ్వరరావు
author img

By

Published : Mar 16, 2021, 6:49 AM IST

‘‘నా నియోజకవర్గంలోని మధిరలో ఆర్వోబీ నిర్మాణంపై లేఖ రాస్తే పరిగణనలోకి తీసుకున్నాం.. మీరు నిధులు ఇవ్వండి అని తిరిగి లేఖ పంపారు. మేం నిధులిస్తే మీరు పరిగణనలోకి తీసుకునేదేమిటి’’ అని రైల్వే పద్దులపై లోక్​సభలో జరిగిన చర్చలో ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ సమయంలో రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ నవ్వుతూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ఠాకూర్‌ వైపు చూపారు. రైల్వే మంత్రి, ఆర్థికశాఖ సహాయ మంత్రి పక్కపక్కనే కూర్చున్నందున.. మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలంటూ నామ నవ్వుతూ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఒక్క ఆర్వోబీ, ఆర్‌యూబీ తేలేకపోతున్నారు? మీరు ఏం ఎంపీ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని నామ పేర్కొన్నారు.

‘‘పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలి. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై పార్లమెంట్‌లో చట్టం చేశారు. ఇప్పుడు దానిని తిరస్కరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాగైతే సభపై ప్రజలకు విశ్వాసం పోతుంది. రాష్ట్రంలో పలు రైల్వే మార్గాలకు నిధులు అడిగినా పట్టించుకోలేదు. దక్షిణ భారతంలోనే పెద్ద రామమందిరం ఉన్న భద్రాచలం రైలు మార్గం నా చిన్నతనం నుంచి కలగానే ఉంది. భద్రాచలం-కొవ్వూరు రైలు మార్గానికి 2012లో అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించినా.. తెలంగాణకే పరిమితం చేశారు. కొవ్వూరు వరకు రైలు మార్గం పూర్తిచేయాలి. రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు, అంచనా వ్యయం, రెవెన్యూ మధ్య రూ.లక్ష కోట్ల తేడా ఉంది. దానిని ఎలా అధిగమిస్తారో తెలపాలి’’ అని నామా కోరారు. ఆ సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రమాదేవి బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు. ఆయన ప్రసంగం ఆరంభంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న పి.వి.మిధున్‌రెడ్డి.. నామా నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తో పాటు సభ్యులు బల్లలు చరిచారు.

కంపా కింద రూ.95.79 కోట్లు మంజూరు చేయండి : కొత్త ప్రభాకర్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘హరితహారం’ పథకానికి కంపా కింద రూ.95.79 కోట్లు మంజూరు చేయాలని తెరాస లోక్‌సభాపక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. 377 నిబంధన కింద లోక్‌సభ ఎదుట ఆయన ఈ అంశాన్ని ఉంచారు. ఆక్రమణల నుంచి అటవీ భూముల రక్షణకు ప్రహరీ, ఫెన్సింగ్‌ నిర్మాణానికి రూ.87.82 కోట్లు, యడ్గరపల్లి అభయారణ్యం భూముల ఫెన్సింగ్‌కు రూ.4.92 కోట్లు, హరితహారం పథక పర్యవేక్షణకు వీలుగా భవన నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించాలని కోరారు.

సౌకర్యాలు కల్పిస్తేనే విద్యాలయాల ఏర్పాటు

తెలంగాణలో ప్రస్తుతం 35 కేంద్రీయ(కేవీ), 9 జవహర్‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)లు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. రాష్ట్రంలో కొత్త విద్యాలయాల ఏర్పాటుపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. ‘‘కొత్త విద్యాలయాల ఏర్పాటు నిరంతర ప్రక్రియ. కేంద్ర విద్యాలయాలకు అవసరమైన వనరులు, భూమి, తాత్కాలిక నివాస సౌకర్యం కల్పించడానికి రాష్ట్రాలు, శాఖలు ముందుకొస్తేనే కొత్తగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటాం. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక జవహర్‌ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు పథకం రూపొందించాం. గత పదేళ్లలో తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల నిర్వహణకు రూ.1,320.28 కోట్లు, జవహర్‌ నవోదయ విద్యాలయాలకు రూ.343.32 కోట్లు ఖర్చుచేశాం’’ అని కేంద్ర మంత్రి తెలిపారు.

  • తెలంగాణలోని మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 11 కేంద్రీయ విద్యాలయాలున్నట్లు చెప్పారు.
  • జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, కామారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, రంగారెడ్డి, సిద్దిపేటల్లో ఒక్కోటి ఉన్నట్లు వెల్లడించారు.

ఆహారశుద్ధి విద్యా సంస్థను ఏర్పాటు చేయండి

ఆహారశుద్ధిలో జాతీయ సాంకేతిక విద్యా సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌ కోరారు. ఆహారశుద్ధి జాతీయ సాంకేతిక సంస్థలు, పెట్టుబడులు, నిర్వహణ బిల్లు-2019 (సవరణ)పై చర్చలో సోమవారం ఆయన మాట్లాడారు. బిల్లుకు తెరాస తరఫున మద్దతు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో పూర్తి చేసిందంటూ అభినందించిన జల్‌శక్తి మంత్రులు, అధికారులు.. నిధులు మాత్రం ఇవ్వడం లేదని ఎంపీ బండ ప్రకాష్‌ అన్నారు.

మిధానిలో వాటా మరింత తగ్గింపు

రక్షణ శాఖకు సంబంధించిన మిశ్రధాతు నిగమ్‌ (మిధాని)లో కేంద్ర ప్రభుత్వ వాటా మరింత తగ్గిస్తామని రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ తెలిపారు. మిధానిలో వాటాల తగ్గింపు ద్వారా ఇప్పటికే రూ.434.15 కోట్లు ఆర్జించినట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సోమవారం ఆయన ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

తెలంగాణలో 22,225.12 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు

దేశంలో 3,33,020.84 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. తెలంగాణలో 22,225.12 మిలియన్‌ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 1607.21 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభలో వేర్వేరు ప్రశ్నలకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.