ETV Bharat / state

Chilli crop: 'మిరప పంట ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్'

దేశంలో మిరప పంట ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన నర్సరీ యాజమానులు, మిరప నారు, పెంపకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మిర్చి పంట (Chilli crop)కు మంచి భవిష్యత్తు ఉందని మంత్రి సూచించారు.

chilli crop
మిరప పంట
author img

By

Published : Aug 14, 2021, 7:25 PM IST

మిర్చి పంట (Chilli crop)కు మంచి భవిష్యత్తు ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన నర్సరీ యాజమానులు, మిరప నారు, పెంపకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నర్సరీ యాజమానులతో మాట్లాడారు. మిరప నారును, పంటలను పరిశీలించారు. దేశంలో మిరప పంట ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

ప్రపంచంలో మిర్చి ఆహారంలోనే కాకుండా బహురూపాలుగా వినియోగంలోకి వచ్చిందన్నారు. పంట ఉత్పత్తి విత్తనం, నారుపై ఆదారపడి ఉంటుందన్నారు. కొంత మంది అత్యాశకు పోయి నకిలి నారును రైతులకు అంటగడుతుంటారని వారిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. నకిలి విత్తనం అరికడితేనే ఉత్పత్తి పెంచవచ్చన్నారు. మార్కెట్‌ ఉన్న పంటలను పండించాలని మంత్రి సూచించారు. తెలంగాణలో నూనె గింజల ఉత్పత్తికి అవకాశం ఉందని... ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ గౌతమ్‌, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

మిర్చి వేస్తే అద్భుతమైన ఆకర్షణ ఉంది. స్థానికంగా ఉండే పారిశ్రామిక వేత్తలకు అర్థం కాలేదు. కానీ చైనా వాడు ముందుచూపుతో ఏ ప్రాంతంలో మంచి మిర్చి వస్తుందని... వాడికి కావాల్సిన నాణ్యత ప్రమాణాలను అంచనా వేసుకుని మీ ఖమ్మం జిల్లాకు వచ్చి చైనా వాడు మిర్చి యూనిట్ పెట్టాడు. కేవలం ఒక్క ప్లాంటు ఒక్క సీజన్​లోనే 2 లక్షల 50 వేల మిర్చిని ఖరీదు చేస్తోంది. అందుకే రైతన్నకు మంచి ధర వస్తోంది. భవిష్యత్​లో మిర్చికి మంచి ధర లభిస్తుంది. ఏషియన్ పెయింట్స్​కు మంచి కలర్ వస్తోందంటే అందులో మిర్చిని అద్దుతారు.

-- నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

'మిరప పంట ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్'

ఇదీ చూడండి:

NHRC: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.