ETV Bharat / state

'ఎల్​ఆర్​ఎస్ పేరుతో ప్రభుత్వం ప్రజలను వేధిస్తోంది'

ఎల్​ఆర్​ఎస్​ పేరిట సామాన్య, మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెదేపా నేతలు ఆరోపించారు. ఎల్​ఆర్​ఎస్ జీవో నంబర్​ 135ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్​ చేశారు.

tdp dharna at khammam
ఎల్​ఆర్​ఎస్ పేరిట ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది: తెదేపా
author img

By

Published : Nov 19, 2020, 4:12 PM IST

ఎల్‌ఆర్​ఎస్‌ జీవో 135ను వెంటనే రద్దు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఖమ్మంలో ధర్నాచౌక్​లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షలను ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం ప్రారంభించారు.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్​ చౌదరి అన్నారు. ఇలాంటి తరుణంలో కష్టించి కొనుక్కున్న స్థలాలకు ఎల్‌ఆర్​ఎస్​ కట్టాలని ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరైంది కాదని ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉపసంహరించుకునేంత వరకు తెలుగు యువత అధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇవీచూడండి: తెలంగాణకు రెండోదశ కరోనా ముప్పు పొంచి ఉంది:హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.