ETV Bharat / state

అక్రమ ఇసుకపై టాస్క్​ఫోర్స్​ దాడి - ఖమ్మంలో అక్రమ ఇసుక స్వాధీనం

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న అక్రమ ఇసుక దందాపై టాస్క్​ఫోర్స్​ అధికారులు కొరడా విదిలించారు. ఇసుక డంప్​లపై దాడులు నిర్వహించి సీజ్​ చేశారు. దాదాపు రూ.11 లక్షల విలువ చేసే ఇసుకను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Task force officers Seize Illegal Sand
అక్రమ ఇసుకపై టాస్క్​ఫోర్స్​ దాడి
author img

By

Published : May 30, 2020, 10:44 PM IST

ఖమ్మం జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక దందాపై టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు చేశారు. జిల్లాలోని వేంసూరు మండలం వెంకటాపురం, మర్లపాడు, కందుకూరులో అనుమతులు లేకుండా నిల్వ చేసిన ఇసుక డంప్​లపై టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించని, సీజ్​ చేశారు. దాదాపు రూ.11 లక్షల విలువ చేసే 550 టన్నుల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సీజ్​ చేసిన ఇసుకను తహశీల్దార్​ సూచన మేరకు ఆయా గ్రామాల వీఆర్వోలకు అప్పగించారు. అనుమతి లేకుండా ఇసుక డంప్​లు నిర్వహిస్తున్న సతీష్​, గంగాధర్​ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా సరిహద్దుల నుంచి ఆంధ్రప్రదేశ్​ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలకు ఇసుక తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ వెంకటరావు హెచ్చరించారు.

ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.