Tammineni comments on cpm support to trs: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని మల్లెపల్లిలో సీపీఎం సీనియర్ నాయకులు కట్ట పుల్లయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మునుగోడు ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఉంటుందని తమ్మినేని వీరభద్రం పునరుద్ఘాటించారు.
మునుగోడు ఉప ఎన్నిక వరకే మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందితే రాష్ట్రంలో మతతత్వం పెరుగుతుందని.. అందుకే తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రిని కలిసి అనేక ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇచ్చామని.. పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. పోడు భూముల సమస్య, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పొత్తు నిర్ణయాలు రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరోవైపు ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో జరిగిన తెరాస నేత హత్యతో సీపీఎంకి ఎలాంటి సంబంధం లేదని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలు, తాత్కాలిక ఆవేశాలతోనే ఆ హత్య జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక వరకే తెరాసకు సీపీఎం మద్దతు ఉంటుంది. భాజపా అభివృద్ధి చెందితే రాష్ట్రంలో మతతత్వం పెరుగుతుంది. అందుకే తెరాసకు మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా పొత్తు నిర్ణయాలు రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యమంత్రిని కలిసి అనేక ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇచ్చాం. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెల్దారుపల్లిలో జరిగిన తెరాస నేత హత్యతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వ్యక్తిగత కారణాలతోనే ఆ హత్య జరిగింది.- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
గతంలోనే మద్దతు..: మునుగోడు ఉపఎన్నికలో తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం గతంలోనే ప్రకటించింది. మునుగోడు ఎన్నిక వరకే తెరాసకు మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గానికి తెరాస పార్టీ వల్ల అన్యాయం జరిగితే.. కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామా వల్ల మునుగోడు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని తమ్మినేని పేర్కొనారు.
ఇవీ చూడండి..
మునుగోడు ఉపఎన్నికలో తెరాసకే మా మద్దతు: తమ్మినేని వీరభద్రం
'దేశంలో విద్వేషం పెరుగుతోంది.. ఆ ఇద్దరు మాత్రం లాభపడుతున్నారు'