భద్రాద్రిలో డిసెంబర్ 24, 25న జరగనున్న తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై భద్రాచలం సబ్ కలెక్టర్ గౌతమ్ సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 24న లక్ష్మణ సమేత సీతారాములకు గోదావరి నదిలో తెప్పోత్సవం... డిసెంబర్ 25న వైకుంఠ ద్వార దర్శనం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సమీక్షించారు. వేడుకల నాటి విధి విధానాలపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భద్రాచలం ఆలయ ఈవో శివాజీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భద్రాచలం ఏజెన్సీలో పులి సంచారం...!