ETV Bharat / state

అనితర సాధ్యుడు ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు

వ్యాయామ ఉపాధ్యాయుడు అంటే కేవలం పిల్లలకు క్రీడల్లో శిక్షణనిచ్చేవారే అనుకుంటాం. కానీ విభిన్నంగా అన్ని రంగాల్లో చిన్నారులకు తర్ఫీదునిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లా కొణిజర్లలో పనిచేస్తోన్న పీడీ శ్రీనివాస్​. సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.

వ్యాయామ ఉపాధ్యాయుడు
author img

By

Published : Mar 24, 2019, 3:45 PM IST

విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణనిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్​
విద్యార్థులను క్రమశిక్షణతో మెలిగేలా చేయడం, క్రీడల్లో తర్ఫీదునివ్వడం వ్యాయామ ఉపాధ్యాయుని విధులు. కానీ విభిన్నంగా తాను పనిచేసే పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా శిక్షణనిస్తున్నారు ఖమ్మం జిల్లా కొణిజర్ల ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తోన్న దొండపాటి శ్రీనివాస్​. క్రీడలు, సామాజిక సేవలు, ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు ఇలా అన్నింటిలో పిల్లలు భాగస్వామ్యమయ్యేలా చూస్తున్నారు.

కార్పొరేటుకు దీటుగా..

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడ పనిచేసినా ప్రజల్లో గుర్తింపు పొందాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఈ వ్యాయామ శిక్షకుడు. సాధారణ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్​ లోనే కాకుండా పిల్లలకు తెలియని జూడో, కరాటే వంటి వాటిలో శిక్షణనిస్తూ వారు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలను క్రమశిక్షణలో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు.

పనిచేసే ప్రతిచోటా ప్రత్యేకతే..

జిల్లాలోని కూసుమంచి, కారేపల్లి, కొణిజర్లలో విధులు నిర్వహించిన శ్రీనివాస్​ ఎక్కడ పనిచేసినా ప్రత్యేకత చాటుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడుగా కలెక్టర్లు, విద్యాశాఖాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. గతేడాది అక్టోబర్​లో స్వచ్ఛభారత్​ కార్యక్రమంలో విద్యార్థులతో చేయించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంధన పొదుపు, ప్లాస్టిక్ ​రహిత సమాజం, ఎయిడ్స్​ నిర్మూలన వంటి వాటిపై పిల్లలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పెద్దలను చైతన్యవంతులను చేస్తున్నారు.

మౌలిక వసతుల కల్పనకు కృషి..

పాఠశాలలో దాతల సహకారంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. ఆడపిల్లలు తమను తాము రక్షించుకునేలా తర్ఫీదునిస్తున్నారు. అంతర్జాతీయ దినోత్సవాలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేదే తన అభిమతమని చెబుతున్నాడు ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు. సర్కారు కొలువంటే బాధ్యతలు తక్కువనే వారికి శ్రీనివాస్​ ఉద్యోగ జీవితం ఆదర్శనీయం.

ఇదీ చూడండి :'ప్రధాని కిసాన్​ సమ్మాన్'​ రెండో విడత నగదు బదిలీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.