ఏపీలోని కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరామర్శించారు. క్షతగాత్రులతో మాట్లాడిన పువ్వాడ.... వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
ప్రమాదంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్ద గోపారం గ్రామానికి చెందిన 10 మంది మృతి చెందగా... ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు చనిపోయారు. వీరందరికీ పరిహారం అందించనున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్..... ఘటనపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
ఇవీ చూడండి: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. 12 మంది మృతి