ETV Bharat / state

సంతోషంగా పండుగకు వస్తాడనుకుంటే.. పార్థివదేహంగా వచ్చాడు.. - శ్రీశైలం భూగర్భ జల విద్యుత్​ కేంద్రం

పండుగ వేళ తమ ఆత్మీయుడు పార్థివదేహంగా రావడంపై గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సంతోషంగా పండుగకు వస్తాడనుకుంటే... పార్థివదేహంగా మారి వచ్చాడని విలపిస్తున్నారు. శ్రీశైలం విద్యుత్​ ప్లాంట్​లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన రాంబాబు భౌతికకాయం ఆయన స్వగ్రామానికి చేరుకుంది.

srisailam fire accident victim deadbody came to his native place in khammam district
సంతోషంగా పండుగకు వస్తాడు అనుకుంటే.. పార్థివదేహంగా వచ్చాడు..
author img

By

Published : Aug 22, 2020, 2:23 PM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయపల్లికి చెందిన రాంబాబు శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం ఉసిరికాయ పల్లికి చేరుకోవడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సొంత ఊరికి దూరంగా పని చేస్తూ పండుగలకు వచ్చే రాంబాబు... పండగవేళ పార్ధివదేహంగా రావడం వల్ల కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా రాంబాబు కుటుంబాన్ని ఆదుకుంటామని స్థానిక శాసన సభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులందరం కలిసి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ఇవీ చూడండి: శ్రీశైలం అగ్నిప్రమాదస్థలికి వెళ్తుండగా రేవంత్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.