రహదారులు శుభ్రపరిచే వాహనాన్ని ఖమ్మం జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇల్లందు పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు స్వయంగా వాహనాన్ని నడిపి ప్రారంభించారు. ఇల్లందు పట్టణంలో రహదారుల శుభ్రతకు ఈ వాహనం దోహదపడుతుందన్నారు.
ఇవీచూడండి: కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష