కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ శివాయిగూడెం వాసులు ఖమ్మం జడ్పీ కూడలిలో ధర్నా చేపట్టారు. రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. కొంత మంది అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే వారు అక్కడ నివసించడానికి కనీస వసతుల కొరత ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మౌలిక వసతులైన తాగునీరు, కరెంటు, రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కల్యాణలక్ష్మి పథకం అక్రమాల్లో వెలుగుచూస్తున్న కొత్తకోణం