సమాజంలో చోటు చేసుకుంటున్న నేరాల నియంత్రణకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీటీమ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు వివిధ అంశాలపై పోలీసులు చైతన్యం కల్పించారు. షీటీమ్స్, 100 డయల్, వ్యక్తిగత క్రమశిక్షణ సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి క్లుప్తంగా వివరించారు.
ఇదీ చూడండి: ప్రజల నుంచి తీసుకుంటున్నారు.. ప్రభుత్వానికి చెల్లిస్తలేరు!