రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించినందు వల్లే... పట్టపగలే ఓ మహిళా అధికారి హత్య జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. తహసీల్దార్ విజయారెడ్డి మృతిపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా... ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టడం లేదని రేణుకాచౌదరి మండిపడ్డారు.
తహసీల్దార్ హత్య పట్ల రేణుకా చౌదరి దిగ్భ్రాంతి - తహశీల్దర్ హత్య ఘటనపై రేణుకా చౌదరి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్ఠంగా లేవనడానికి తాహసీల్దార్ విజయ సజీవదహనమే నిదర్శనమని... కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తులతో విజయారెడ్డికి నివాళులర్పించారు.
తహసీల్దర్ హత్య ఘటనపై రేణుకా చౌదరి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించినందు వల్లే... పట్టపగలే ఓ మహిళా అధికారి హత్య జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. తహసీల్దార్ విజయారెడ్డి మృతిపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా... ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టడం లేదని రేణుకాచౌదరి మండిపడ్డారు.
sample description