ETV Bharat / state

'లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం మానసిక సంతృప్తి ఇస్తుంది' - కల్యాణ లక్ష్మీ చెక్కులు

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమం మానసిక సంతృప్తిని ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

sathupally mla sandra venkata veeraiah cheques distribution at khammam
'లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం మానసిక సంతృప్తి ఇస్తుంది'
author img

By

Published : Apr 11, 2021, 7:46 PM IST

ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పర్యటించారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించారు. 88 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కులను, 38 మందికి షాదీ ముబారక్ చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు.

ఇంటింటికి తిరిగి చెక్కులు అందిస్తున్నామని... ఈ కార్యక్రమం మానసిక సంతృప్తిని ఇస్తుందని వెంకటవీరయ్య తెలిపారు. ఆడపిల్లలకు పెళ్లిచేయడం తల్లిదండ్రులకు ఇబ్బంది కాకూడదనే ఈ పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారని వెల్లడించారు. ఎంపీపీ రఘ, డీసీసీబీ డైరక్టర్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఉపఎన్నిక వేళ... వెక్కిరిస్తోన్న సమస్యల మేళా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.