రహదారి భద్రతను పాటిస్తూ ప్రమాదాలకు దూరం కావాలని వైరా ప్రాంతీయ రవాణా అధికారి శంకర్‌నాయక్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఠాగూర్ విద్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు అతివేగం, ప్రమాదాలకు కారణాలు, జాగ్రత్తలు వంటి వాటిని వివరించారు. ఇంటి వద్ద కుటుంబసభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని సూచించారు. వేగంతో ప్రాణనష్టం వాటిల్లుతుందని తెలిపారు. హెల్మెట్, కార్లో సీటు బెల్టు పెట్టుకోవడం గురించి తెలిపారు. ఠాగూర్ విద్యాసంస్థల ఛైర్మన్ సునీత, కరస్పాండెంట్ రవికుమార్, డైరెక్టర్ సంయోగిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అశ్లీల వీడియోలు చూపించే... ఆ సార్ మాకొద్దు..!