ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు వాగు పైవంతెన సమీపాన ఉన్న రహదారి.. వరద ఉద్ధృతికి కోతకు గురైంది. మాటూరు నుంచి ఆంధ్రప్రదేశ్లోని గంపలగూడెం మండలంలోని పలు గ్రామాలకు నిత్యం వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. రహదారి కోతకు గురవడం వల్ల ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయాయి.
కోతకు గురైన రహదారి వద్ద తరచూ ప్రమాదాలు జరిగేవని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలని కోరారు.