లాక్డౌన్ నేపథ్యంలో సామాన్యుడికి మద్యం దొరక్కపోయినా.. అధికారులకు మాత్రం ఖరీదైన మందు బాటిళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా మధిర రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో తహసీల్దార్ సైదులు, ఈవో పీఆర్డీ రాజారావు, వీఆర్ఏ గంటా శ్రీను మద్యం సేవిస్తూ కింది స్థాయి ఉద్యోగులను బయట కాపలా ఉంచారు.
భౌతిక దూరం పాటించాలని, ఇళ్లలోంచి బయటకు రావద్దని మాటలు వల్లించే బాధ్యత కలిగిన అధికారులే మద్యం సేవిస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. విధులు నిర్వర్తించిన తర్వాత విశ్రాంతి భవనంలో సేద తీరుతున్నామని.. మందు పార్టీ చేసుకోవట్లేదని తెలిపారు.