Reopening of Khammam cotton market: వారం రోజుల సెలవు తర్వాత ఖమ్మం పత్తి మార్కెట్ పునః ప్రారంభమైంది. కొనుగోలు దారులకు జీఎస్టీ పన్ను బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో మార్కెట్ కమిటీ అధికారులు మార్కెట్‌కు వారం రోజులు సెలవు ప్రకటించారు. వారం తర్వాత మార్కెట్ తెరుచుకోవడంతో పత్తి రైతులు భారీగా పత్తిని తీసుకొచ్చారు.
మంత్రి పువ్వాడ అజయ్ హామీ మేరకు కొనుగోళ్లు ప్రారంభించామని. బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తే మాత్రం తిరిగి కొనుగోళ్లు నిలిపివేస్తామని వ్యాపారులు అంటున్నారు. వారం రోజులు విరామం ఇచ్చిన ఖరీదు దారులు పత్తి ధరను పూర్తిగా తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాకు సుమారు వెయ్యి నుంచి 12 వందల వరకు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
"ఈ రోజు మార్కెట్లో వారం రోజుల తర్వాత క్రయవిక్రయాలు మొదలయ్యాయి. కాని జీఎస్టీ మీద మాకు ఇంతవరకు స్పష్టమైన హామీ ఎవరూ ఇవ్వలేదు. కలెక్టర్ గారిని కలవడం కోసం ప్రయత్నించాం కాని అపాయింట్మెంట్ దొరకలేదు. కాకపోతే మంత్రిగారు మమ్మల్ని పిలిచి మార్కెట్ చేయండి రైతులు ఇబ్బంది పడుతున్నారు మీకు నేను అండగా ఉంటానని చెప్పారు. హరీష్ రావు గారితో నేను మాట్లాడి జీఎస్టీ కౌన్సిల్కి ఉన్న సమస్యని రిఫర్ చేస్తానని చెప్పారు. "-ఆనంద్, ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతి శాఖ అధ్యక్షుడు
"వారంరోజుల తరువాత మార్కెట్ తెరిచినా ధర తగ్గించారు. పైన తగ్గించారో తెలియదు.. వీళ్లే తగ్గించారో తెలియదు.. క్వింటాకు వేయి నుంచి 1200 రూపాయలు తగ్గించారు. దీనివల్ల మాకు నష్టం ఇంకా పెరుగుతుంది"- పత్తి రైతు
ఇవీ చదవండి: