తెరాస టికెట్ దక్కని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును ఓ దశలో పరిశీలించారు. ఆయన నుంచి స్పందన లేకపోవడం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారు. రవిచంద్ర గత శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోవడం... స్థానికేతరుడు కావడం వల్ల ఆయన పేరును తొలగించారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పేరును ఆఖరి నిమిషం వరకు పరిశీలించారు. అన్ని కోణాల్లో కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం రేణుక వైపు మొగ్గుచూపింది.
ఇదీ చూడండి:కేసీఆర్ బహిరంగ సభలు... కేటీఆర్ రోడ్ షోలు