రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా జలాశయం నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. అనంతరం మండలంలోని తాటిపూడి, రెబ్బవరం గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
వ్యవసాయ రంగానికి భరోసా కల్పిస్తూ.. సీఎం కేసీఆర్ అన్నదాతలకు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే కొనియాడారు. సాగునీటి వనరులను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలో వేలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని గుర్తు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్ముందు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగు భూములు సస్యశ్యామలం కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైరా జలాశయం కింద విడుదల చేస్తున్న నీటిని పొదుపుగా వాడుతూ.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్‌చైర్మన్ రాజశేఖర్, జడ్పీటీసీ కనకదుర్గా, ఎంపీపీ పావని, మున్సిపల్ చైర్మన్ జైపాల్, వైస్‌చైర్మన్ సీతారాములు, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'రైతుల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోంది'