ETV Bharat / state

పత్తిసాగులో అంతర పంటగా కంది వేయండి: ఆర్వీ కర్ణన్​

ఈసారి ఖరీఫ్​ సీజన్​కు పత్తి సాగులో అంతర పంటగా కంది సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ రైతులకు సూచించారు. ప్రభుత్వం కూడా మద్దతు ధర ఇస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో వానాకాలం పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ​సీఎం కేసీఆర్​ సూచించిన నూతన పంటల విధానాన్ని అందరూ అవలంభించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు.

పత్తిసాగులో అంతర పంటగా కంది వేయండి: ఆర్వీ కర్ణన్​
పత్తిసాగులో అంతర పంటగా కంది వేయండి: ఆర్వీ కర్ణన్​
author img

By

Published : May 29, 2020, 7:27 PM IST

ఖరీఫ్ సీజన్​కు పత్తి సాగులో అంతర పంటగా కంది సాగు చేయాలని.. ఈసారి కంది పంటను కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కారం, చిన్న కోరుకొండి గ్రామాల్లో వానాకాలం పంటలపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు.

కల్లూరు మండలంలో సన్న రకం పంటలను ఎక్కువ ఎకరాల్లో సాగు చేయాలని.. లావు రకం తక్కువ ఎకరాల్లో సాగు చేయాలని కలెక్టర్​ సూచించారు. యాసంగి సాగుకు ముందే సత్తుపల్లి నియోజకవర్గంలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. పత్తి పంటలో గులాబీ పురుగులు రాకుండా వేప నూనెను ఎక్కువగా వినియోగించాలని రైతులకు వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచించిన నూతన పంటల విధానాన్ని ప్రతి రైతు అవలంబించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. మన రాష్ట్రంలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంటే, కేవలం లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే మనం వినియోగించుకుంటున్నామని తెలిపారు. మనం తినే పంటల్ని సాగు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టారని.. రైతులందరూ ఆమోదించాలని ఎమ్మెల్యే కోరారు.

ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.