ETV Bharat / state

నామా లేఖకు స్పందించిన ద.మ. రైల్వే జీఎం గజానన్

పెగళ్లపాడులో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై చొరవ చూపిన నామా.. రైల్వే జీఎంకు లేఖ రాశారు. ఆయన లేఖ పట్ల జీఎం స్పందించారు.

railway-gm-gajanan-mallya-respond-on-mp-nama-nageswara-rao-letter
నామ లేఖ పట్ల స్పందించిన రైల్వే జీఎం
author img

By

Published : Dec 18, 2020, 5:33 PM IST

పెగళ్లపాడులో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఎంపీ నామా నాగేశ్వర రావు రాసిన లేఖ పట్ల రైల్వే జీఎం గజానన్ మాల్యా వెంటనే స్పందించారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని నామా క్యాంపు కార్యాలయానికి శుక్రవారం లేఖ రాశారు. ఇటీవల ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండల పర్యటనలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు నామాను కలిసి... పెగళ్లపాడులో రైల్వే బ్రిడ్జి నిర్మించాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన... దక్షిమ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాశారు.

పెగళ్లపాడులో ఆర్​యూబీ అవసరం ఉందని... రైల్వే ట్రాక్ దాటాలంటే 2కి.మీ అధికంగా వెళ్లాల్సి వస్తుందని లేఖలో నామా వివరించారు. వ్యవసాయ పనులు, ఇతరుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతానని తెలిపారు. ఈ అంశంపై నామా తక్షణ చొరవ, జీఎం స్పందన పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​ యూప్​లో రుణం తీసుకుంటే అంతే సంగతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.