Tilak Varma Century : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఈసారి వన్ డౌన్లో బరిలోకి దిగిన తెలుగు తేజం తిలక్ వర్మ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే తిలక్ తనకు చెప్పి మరీ ఈ మ్యాచ్‌లో రప్ఫాడించాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
'రెండో మ్యాచ్ తర్వాత తిలక్ నా రూమ్‌లోకి వచ్చాడు. మూడో టీ20లో వన్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగుతానని నాతో చెప్పాడు. తప్పుకుండా రాణిస్తాననే నమ్మకం ఉందని అన్నాడు. అందకు నేను కూడా సరే అన్నాను. అప్పుుడు అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్, ఇప్పుడు సెంచరీతో అదరగొట్టాడు. దీంతో తనతోపాటు ఫ్యామిలీ కూడా హ్యాపీగానే ఉండి ఉంటారు. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనదంగా ఉంది. చర్చించుకున్నట్లే మేం బ్రాండ్ క్రికెట్ ఆడాం. మా కుర్రాళ్లు నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశారు. జట్టు మంచి మార్గంలోనే వెళ్తుందని అనుకుంటున్నా' అని మ్యాచ్ అనంతరం సూర్య కుమార్ అన్నాడు.
ఇది నా కల
I bet that no indian will pass without liking this century by Tilak. #SAvsIND #TilakVermapic.twitter.com/SuIeXfUkNn
— Mufaddal Parody (@mufaddal_voira) November 13, 2024
This one will stay with me! A night to remember 🇮🇳❤️ pic.twitter.com/3Y9d0eWUa0
— Tilak Varma (@TilakV9) November 13, 2024
తొలి సెంచరీతోనే రికార్డ్
తిలక్ వర్మ కెరీర్లో తొలి సెంచరీతోనే రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ టీ20 సెంచరీ చేసిన రెండో అతి పిన్నవయస్కుడి (22 ఏళ్ల 4 రోజులు)గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో యశస్వీ జైస్వాల్ (21 ఏళ్ల 279 రోజుల్లో నేపాల్‌పై)
తిలక్ వర్మ సూపర్ సెంచరీ- టీమ్ఇండియా థ్రిల్లింగ్ విన్
తిలక్ వర్మ సూపర్ సెంచరీ - మూడో టీ20లో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం