ETV Bharat / state

ఖమ్మంలో దొంగ ఓట్ల వ్యవహారం - తుమ్మల, పువ్వాడ మధ్య మాటల తూటాలు - ఖమ్మం రాజకీయాలు 2023

Puvvada Fires on Tummala Over Fraud Votes Complaint : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వేళ ఖమ్మంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాటల తూటాలతో బస్తీమే సవాల్ అంటూ నేతలు కత్తులు దూస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. అయితే తాజాగా ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేయడం ఇక్కడి రాజకీయం మరింత రంజుగా మారింది. తుమ్మలపై మంత్రి పువ్వాడ తీవ్రంగా ధ్వజమెత్తారు.

Minister Puvvada Fires to Tummala
Minister Puvvada
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2023, 1:39 PM IST

ఖమ్మంలో దొంగ ఓట్ల వ్యవహారం - తుమ్మల, పువ్వాడ మధ్య మాటల తూటాలు

Puvvada Fires on Tummala Over Fraud Votes Complaint : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు పువ్వాడ.. మరోవైపు తుమ్మల మాటల తూటాలతో కత్తులు దూస్తున్నారు. బస్తీమే సవాల్ అంటూ తలపడతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం పర్యటన అనంతరం.. తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్ ఇలా రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. ఖమ్మంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ తర్వాత వాళ్లకు ఓటమి భయం పట్టుకుందంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్​పై ధ్వజమెత్తుతున్నారు.

Puvvada Comments on Tummala : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మరోసారి విమర్శల దాడి చేశారు. సీనియర్‌ నాయకుడినని చెప్పుకునే తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తుమ్మలకు ఓటు వేసే వారికే ఓటు ఉండాలా అని ప్రశ్నించిన పువ్వాడ.. కక్షపూరితంగానే మమత కళాశాలల విద్యార్థుల ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని విమర్శించారు.

ఇదీ జరిగింది : ఖమ్మం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 35 వేల దొంగ ఓట్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని.. దిల్లీలో భారత ఎన్నికల సంఘానికి(Election Commission of India) సోమవారం రోజున ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తుమ్మలతో పాటు సహ కార్యకర్త కోయిన్ని వెంకన్న తాను సేకరించిన సమాచారంతో ఈసీ అధికారులను కలిశారు. ఖమ్మం నియోజకవర్గంలో రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్​కు చెందిన మమత వైద్య, దంత కళాశాలల్లోని వసతి గృహాలు, వివిధ బ్లాక్‌ల్లో వందల కొద్దీ దొంగ ఓట్లను నమోదు చేశారంటూ సంబంధిత వివరాలను ఫిర్యాదు కాపీకి తుమ్మల జత చేశారు.

'పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తుప్పలు కావాలా?'

Tummala Complaint To EC On Fraud Votes : మంత్రి పువ్వాడ, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఖమ్మం నగర పాలక కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి ఉద్దేశపూర్వకంగానే దొంగ ఓట్లు నమోదు చేయించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలో ఓట్లు జాబితా నుంచి తొలగించారని ఫిర్యాదులో తుమ్మల ఆరోపించారు. ఇందుకు సహకరించిన కలెక్టర్‌, నగర పాలక కమిషనర్‌ను ఖమ్మం జిల్లా నుంచి బదిలీ చేయాలని భారత ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో మొత్తంగా 15 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని.. వాటన్నింటినీ తొలగించి సక్రమమైన జాబితాతోనే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలని కోరారు.

Political Heat in Khammam : ఇదీలా ఉంటే.. ఖమ్మంలో బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్.. కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. 2014 తర్వాత ఇద్దరూ మరోసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్.. టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. ఆ తర్వాత ఇద్దరూ బీఆర్ఎస్​లో చేరారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తుమ్మలకు పాలేరు సీట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్​లో చేరారు. దీంతో ఖమ్మం పోరు రసవత్తరంగా మారింది.

ఖమ్మంలో రాజకీయ కాక - సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి టీడీపీ మద్దతు కోరిన తుమ్మల నాగేశ్వరరావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.