ETV Bharat / state

సీజన్​ ఆరంభంలోనే ధరల రూపంలో అన్నదాతలకు అవస్థలు..

కోటి ఆశలతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు.. సీజన్ ఆరంభంలోనే పరీక్ష తప్పడం లేదు. విత్తనాలు, ఎరువుల ధరలు అమాంతం పెరిగి కర్షకులు కష్టాలు పడుతున్నారు. వ్వవసాయ శాఖ ముందే మేల్కొని విత్తన వ్యాపారుల ఆగడాలకు అరికట్టాలని రైతులు కోరుతున్నారు.

Problems for formers in beginning of the season
author img

By

Published : Jun 21, 2022, 3:02 AM IST

Updated : Jun 21, 2022, 5:06 AM IST

నైరుతి రుతుపవనాల రాష్ట్రంలో ప్రవేశించడంతో.... ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగు సందడి మొదలైంది. తొలకరి పలకరింపుతో రైతులు వానాకాలం పంటల సాగు మొదలుపెట్టారు. మండల కేంద్రాలు, స్థానికంగా ఉన్న దుకాణాల్లో.... విత్తనాలు కొనేందుకు వస్తున్న రైతులతో సందడి నెలకొంది. గతంలో కన్నా భిన్నంగా ఈసారి సాగు కష్టాలు మరింత రెట్టింపయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రైతులంతా విత్తనాలకోసం కంపెనీలు, దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. జిల్లా, మండల కేంద్రాల్లోనే కాదు..గ్రామీణ ప్రాంతాల్లోనూ విత్తనాలు, ఎరువుల దుకాణాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఖమ్మం జిల్లాలో 300, భద్రాద్రి జిల్లాలో 400 వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని చాలావరకు దుకాణాలు.... కూడబలుక్కున్నట్లు విత్తనాలు ధరలు పెంచేశాయి. రైతులు అడిగిన కంపెనీ విత్తనాలు ఇవ్వడం లేదు. అటు రైతు బంధు నగదు ఇంకా రాక.. పంట దిగుబడిపై ఆశలు లేక... రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీజన్ ఆరంభంలోనే ఇలా ఉంటే.. మున్ముందు.. తమ పరిస్థితి ఏంటని అన్నదాతలు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణ కొరవడటం వల్లే.. తమకు సమస్యలు ఎదురవుతున్నాయని.. రైతులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 21, 2022, 5:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.