ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే తమకు ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన నిర్వహించారు. హైదరాబాద్లో మృతి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయిని శివాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
వేతనాలు లేక తామంతా అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేటు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నిత్యావసరాల కోసమైనా నెలకు రూ. 10,000 ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు.