నేడు ఖమ్మంలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి మదనగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి కార్యాలయానికి ప్రజలు తరలివచ్చారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను లోపలికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు.