ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఒక పేద రైతు తనకున్న ఎకరన్నర పొలంలో గేదల సహాయంతో వ్యవసాయం చేస్తున్నాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో పాడి గేదెల సహాయంతో ఎకరం స్థలంలో మిరప.. మరొక అరెకరంలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు.
భార్య వెంకటలక్ష్మి సహాయంతో పాడి గేదెలను వినియోగిస్తూ మిరప తోట పనులు చేస్తున్నాడు. పాడి గేదలు సైతం రైతుకు వ్యవసాయంలో సహకరించే చేస్తూ తోడ్పాటును అందిస్తున్నాయి.