ETV Bharat / state

మోదీని కలిసిన పొంగులేటి సుధాకర్​ రెడ్డి

కాంగ్రెస్​ నుంచి రోజుకొకరు చేజారుతున్నారు. ఓ వైపు ఓటమి.. మరోవైపు వరుస ఫిరాయింపులతో హస్తం పార్టీ సతమతమవుతోంది. కొంతకాలంగా అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న పొంగులేటి సుధాకర్​ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి.. మధ్యాహ్నం మోదీని కలిశారు.

author img

By

Published : Mar 31, 2019, 6:28 PM IST

'చే' జారి కాషాయం కప్పుకున్న పొంగులేటి
'చే' జారి కాషాయం కప్పుకున్న పొంగులేటి
హస్తం నుంచి మరో నేత చేజారిపోయారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్​ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. రాజీనామా లేఖను రాహుల్​ గాంధీకి పంపారు. ఇవాళ మధ్యాహ్నం ప్రధానితో సమావేశమైన పొంగులేటి మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఉగ్రదాడిపై వారి తీరు బాధాకరం

టికెట్​ కేటాయింపు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్​ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.​ కేటాయింపులో ధనప్రభావం ఉందని ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో, దేశంలో హస్తం పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కలత చెందినట్లు పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిపై కాంగ్రెస్​ నేతలు మాట్లాడిన తీరు చాలా బాధాకరమన్నారు.

మళ్లీ మోదీయే ప్రధాని

మోదీలాంటి బలమైన నాయకుడి నాయకత్వంలో పనిచేయాలనే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:భారత్​ భేరి: నరేంద్రుడిదీ కవిత కథే!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.