ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మంలో రసవత్తరంగా రాజకీయ 'ఆట' - సై అంటే సై అంటున్న అభ్యర్థులు - Parties campaign in Telangana assembly elections

Political Heat in Joint Khammam District : రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. ఏ క్షణంలోనైనా గెలుపోటములు తారుమారయ్యే క్రికెట్‌ ఆటలా.. ఈ ఎన్నికల తంతు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రసవత్తరంగా రాజకీయ ఆట నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

Telangana Assembly Elections 2023
Political Heat in Joint Khammam District
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 11:36 AM IST

Political Heat in Joint Khammam District : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల వేటలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్​ కోసం కొందరు.. మరో ఛాన్స్​ కోసం మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ క్రీడకు తెరలేపారు. ప్రపంచకప్‌ క్రికెట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుని దిగ్గజ ఆస్ట్రేలియాను ఢీకొంటున్న తరుణంలో ఈ ఎన్నికల పోరు సైతం ఆటలోని వ్యూహాలను తలపిస్తోంది. ఈసారి కొడితే సిక్సరే అనే ఊపులో కొందరు అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. దీంతో వాళ్ల బ్యాటింగ్‌ను దెబ్బతీసే బౌలింగ్‌ వ్యూహాలకు ప్రత్యర్థులు పదునుపెడుతున్నారు.

ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు

Khammam Constituency : ఖమ్మంలో బీఆర్ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ (Puvvada Ajay Kumar), కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) పోటీపడుతున్నారు. విమర్శల లాంటి బౌన్సర్లను సిక్సర్లుగా మల్చుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. స్కోర్‌ బోర్డును పరిగెత్తించే అదనపు పరుగుల మాదిరిగా హామీలు తమ మెజార్టీని నిర్దేశిస్తాయని పావులు కదుపుతున్నారు.

Aswaraopeta Constituency : అశ్వారావుపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నుంచి జారె ఆదినారాయణ పోటీ చేస్తున్నారు. ఇరువురూ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వరుసగా రెండోసారి విజయం సాధించాలని మెచ్చా నాగేశ్వరరావు.. అరంగేట్రంతోనే గెలుపొందాలని జారె ఆదినారాయణ ఉవ్విళ్లూరుతున్నారు.

Paleru Constituency : పాలేరులో బీఆర్ఎస్ తరఫున కందాళ ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy), సీపీఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) బరిలో నిలిచారు. క్రికెట్‌ ఆటలో బెట్టింగ్‌ల మాదిరి అభ్యర్థుల గెలుపోటములపై పందేలు ప్రారంభమయ్యాయి. ఆటలో గెలుపునకు ప్రతి పరుగూ కీలకమెలాగో గుర్తించిన అభ్యర్థులు.. ఏఓటూ చేజారకుండా కీలక పల్లెలపై కన్నేశారు.

ఖమ్మంలో రాజకీయ కాక - సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

Pinapaka Constituency : పినపాకలో రేగా కాంతారావు (బీఆర్ఎస్), పాయం వెంకటేశ్వర్లు (కాంగ్రెస్‌) నుంచి పోటీపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తామేం చేశామో ప్రజలకు చెబుతూనే.. ప్రత్యర్థి తప్పిదాలను ఎవరికివారు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. అడపాదడపా యార్కర్ల లాంటి మాటల తూటాలతో విమర్శలు గుప్పించుకుంటున్నారు.

Sathupalli Constituency : సత్తుపల్లిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య, హస్తం పార్టీ అభ్యర్థిగా మట్టా రాగమయి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ నువ్వానేనా అనేలా తలపడతున్నారు. వరుసగా నాలుగోసారి విజయం సాధించాలనే లక్ష్యంగా సండ్ర వెంకటవీరయ్య ఉండగా.. అరంగేట్రంలోనే గెలిచి తీరాలని మట్టా రాగమయి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

Bhadrachalam Constituency : భద్రాచలంలో బీఆర్ఎస్‌ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్‌ నుంచి పొదెం వీరయ్య సై అంటే సై అంటున్నారు. పది సంవత్సరాల కేసీఆర్‌ పాలనలో నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని పొదెం వీరయ్య ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా కొత్తగా భద్రాచలానికి పొదెం చేసిందేమీ లేదని తెల్లం వెంకట్రావు విమర్శిస్తున్నారు. ఇరువురూ పరస్పరం బౌన్సర్లు విసురుకుంటూ ఆటను రక్తి కట్టిస్తున్నారు.

Yellandu Constituency : ఇల్లెందులో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా.. బానోతు హరిప్రియ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోరం కనకయ్య బరిలో దిగారు. ఒకరి వైఫల్యాలను మరొకరు ఎత్తిచూపుతూ ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఎందుకైనా మంచిదని తమ జట్టులో కీలక ఆటగాళ్లపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.

Madhira Constituency : మధిరలో గెలిచేందుకు బీఆర్ఎస్ నుంచి లింగాల కమల్‌రాజు, కాంగ్రెస్‌ నుంచి మల్లు భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka) తలపడుతున్నారు. ఇరువురూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్‌ సాధించిన భట్టి విక్రమార్క.. కాలం కలిసొచ్చి హస్తం పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవి దక్కుతుందనే ఆశతో ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. మరోవైపు ఎలాగైనా ఓటర్ల హృదయాలను గెలిచి పాగా వేయాలని లింగాల కమల్‌రాజు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

Political Heat in Khammam District : రసవత్తరంగా ఖమ్మం రాజకీయం.. నువ్వానేనా అంటూ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఢీ

Wyra Constituency : వైరాలో బీఆర్ఎస్ నుంచి బానోతు మదన్‌లాల్‌, కాంగ్రెస్ నుంచి మాలోతు రాందాస్‌నాయక్‌ సై అంటే సై అంటున్నారు. చేసిన అభివృద్ధిని ట్రాక్‌ రికార్డుగా పరిగణించాలని కోరుతూ మరోసారి గెలిచేందుకు మదన్‌లాల్‌ ప్రయత్నిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల శ్రమ, సహనానికి బరిలో నిలిచే అవకాశం వచ్చిందని, ప్రేక్షకులను అలరించినట్టే.. గెలిపిస్తే జనరంజక పాలన అందిస్తానని రాందాస్‌నాయక్‌ అంటున్నారు.

Kothagudem Constituency : కొత్తగూడెంలో బీఆర్ఎస్‌ నుంచి వనమా వెంకటేశ్వరరావు, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao ), ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్ నుంచి జలగం బరిలో నిలిచారు. ఎవరికి వారు ప్రత్యర్థుల బలహీనతలపై గురిపెడుతూన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశామని, మరోసారి గెలిపిస్తే తమదైన శైలిలో నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ముగ్గురూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు.

Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు

సీతారామ ప్రాజెక్టుతో పాలేరుకు గోదావరి నీళ్లు అందిస్తా : కందాల ఉపేందర్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.