రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతా వారోత్సాలు నిర్వహిస్తున్నట్లు సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మనోహర్ తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోలీసులు హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనాలపై తిరుగుతూ ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమాన్ని ఎంవీఐ మనోహర్, అసిస్టెంట్ కమాండెంట్ ఉదయ భాస్కర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ బైకు నడిపేటప్పుడు హెల్మెట్, కార్లు నడిపినప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని మనోహర్ కోరారు. చరవాణీలో మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సూచించారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం